డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ కలకలం రేపింది. ఉగ్ర కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా అవసరమని లేఖలో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరీ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచనలు చేశారు. విజయనగరంలో ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.