BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ ల సమయం పొడిగించింది BCCI పాలకమండలి. ఐపీఎల్లో ఉండే అదనపు సమయాన్ని మరో గంట పొడిగించనున్నట్లు ప్రకటన చేసింది BCCI. ఇది వరకు 60 నిమిషాలు అదనపు సమయం ఉండగా.. 20వ తేదీ నుంచి ఆ సమయాన్ని 120 నిమిషాలకు పొడిగించారు.

ఇకపై జరిగే అన్ని మ్యాచులకు ఈ నియమం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది BCCI. ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది BCCI.