2019 ఎన్నికలలో అత్యంత భారీ మెజార్టీతో తనను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి జగన్ అనేక రీతులుగా పరిపాలన చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ జగన్ పరిపాలన చేస్తున్నారు. ఇదే క్రమంలో తనకి మరియు ప్రజలకు మాత్రమే కనెక్షన్ ఉండేలా వాలంటరీ విధానాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న.. వైయస్ జగన్ కి మాత్రం సొంత పార్టీలో నాయకులు చేస్తున్న పనులు, ఆయన పరువు మొత్తం తీసే విధంగా ప్రస్తుతం మారాయి. సంక్షేమ పథకాలతో మరియు పరిపాలనతో మంచి పేరు సంపాదించుకున్న వైయస్ జగన్ కి మంచి ఆదరణ దక్కుతుంది. ఇటువంటి టైం లో మాచర్ల ఘటనలో నడిరోడ్డుపై వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడి వీడియో ఆ తర్వాత మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం పార్టీ పరువు ప్రస్తుతం తీస్తున్నట్లు అయింది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా మీడియా ముందు భాషా సంస్కారం మర్చిపోతూ కుక్క, నక్క, గాడిద, గబ్బిళం అంటూ విరుచుకుపడుతున్నారు.
ఇంకొందరు.. నోటికి అన్నం తింటున్నావా.. పెంట తింటున్నావా అంటూ మీడియా ముందే రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తేనే తట్టుకోలేక జనం వైసీపీకి అధికారం కట్టబెట్టారు. మళ్లీ ఇదే సీన్ వైసీపీ నేతలు ప్రస్తుతం చేస్తున్న నేపథ్యంలో పార్టీలో ఓవరాక్షన్ చేసే నాయకులను జగన్ పక్కన పెట్టకపోతే పార్టీ పరువు మొత్తం మటాష్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.