నేను ఎక్స్‌పోజింగ్ చేయడం మానేస్తాను.. నాతో సినిమా తీయండి ..సతీ సావిత్రి పాత్రలో నటిస్తా ..!

-

హాట్ యాంకర్ రష్మిగౌతమ్‌ వాస్తవంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కానీ తన ఎక్స్‌పోజింగ్, అండ్ స్కిన్ షో వల్ల ఎపుడు తనని ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు. అది సినిమా కి సంబంధి అయినా, జబర్దస్త్ షో విషయంలో అయినా. అయితే ఇవి రష్మీకి కొత్తేం కాదు. ఎప్పటి నుంచో ఇలాంటి వన్ని ఎదుర్కొంటూ వస్తూనే ఉంది. అంతేకాదు తిరిగి వాటికి సమాధానం కూడా ఘాటుగా ఇస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ మళ్ళీ రష్మీ మీద చేశారు. సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలని పోస్ట్ చేయడమే కాదు తన అప్‌డేట్స్ కూడా ఇక్కడ ఇస్తుంటుంది.

 

ఇదే కాదు నిరంతరం పలు సామాజిక అంశాల మీద, కొన్ని సంచలన విషయాల మీద రష్మీ స్పందిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనను ఎవరైనా విమర్శించినా.. తను చేస్తున్న సినిమాల మీద గాని జబర్దస్త్ మీద గాని కామెంట్స్ చేసినా కూడా వెంటనే రియాక్ట్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కంటే కూడా జబర్దస్త్ కామెడీ షో సమాజానికి చాలా కీడును చేస్తుంది. కరోనా కంటే ముందు జబర్దస్త్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ సంచలనమైన కామెంట్స్ చేశాడు.

దాంతో ఆ కామెంట్స్ పై యాంకర్ రష్మీ సీరియస్ గా స్పందించింది. మిమ్ములను ఎవరు బలవంతపెట్టి జబర్దస్త్ షో చూడమని చెపడం లేదు కదా ..మీ చేతులు కట్టేసి టీవీ ముందు కూర్చో బెట్టి ఆ షోను చూపించడం లేదుగా. మేము స్టేజ్ పై డాన్స్ చేస్తున్నప్పుడు మీరు కళ్లు మూసుకోండి .. లేదంటే ఛానెల్ మార్చుకోండి. అంతే తప్ప ఇలా ఇష్టమొచ్చినట్టు మామీద విమర్శలు చేసే హక్కు మీకు లేదంటూ రివర్స్ లో కామెంట్స్ చేసింది. అంతేకాదు నేను గ్లామరస్ గా కనిపించడం మీకు నచ్చకపోతే మీరే నిర్మాతగా డబ్బులు పెట్టి ఒక సినిమా తీయండి. ఆ సినిమాలో నాకు సతి సావిత్రి పాత్రను ఇవ్వండి చేస్తానంటూ మైండ్ బ్లాకయ్యే కౌంటర్ ఇచ్చింది. ఇలా రష్మీ రియాక్టయినందుకు తనని చాలా మంది అభినందించారు. అంతేకాదు చాలామంది రష్మీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news