మహిళల ఆరోగ్యం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. హార్మోన్ ల అసమతుల్యత ఏర్పడడం వలన ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే, ప్రతిరోజు ఆహారంలో మార్పులను చేసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి అలవాటు చేసుకుంటే హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది. రోజువారి ఆహారంలో భాగంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా హార్మోన్ ల అసమతుల్యతను తగ్గించుకోవచ్చు. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే అల్లం ను తీసుకుంటారో, హార్మోన్ లు స్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గించడానికి అల్లం ఎంతో సహాయపడుతుంది.
అదేవిధంగా పీరియడ్స్‌లో పసుపు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండటం తో హార్మోన్ లు స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. దాల్చిన చెక్కను కూడా హార్మోన్ ల అసమతుల్యతకు ఉపయోగించవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. హార్మోన్ లను స్థిరంగా ఉంచేందుకు వెల్లుల్లి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో బాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుంది. హార్మోన్ ల అసమతుల్యతను తగ్గించడానికి అవిసగింజలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఈస్ట్రోజెన్ సమతుల్యతను మెరుగుపరుస్తాయి.
వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో నొప్పులను తగ్గించడానికి మెంతులు ఎంతో సహాయపడతాయి. మెంతులను ఉపయోగించి టీ తయారు చేసుకుని తాగడం ద్వారా ఎంతో ఉపశమనాన్ని పొందవచ్చు. అదేవిధంగా అశ్వగంధ కూడా పీరియడ్స్ సమయంలో హార్మోన్ ల అసమతుల్యతను తగ్గించడానికి సహాయపడుతుంది. అశ్వగంధలో ఉన్న గుణాలు అడ్రినల్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.