మాధురీ సాంగ్ కు డ్యాన్స్ చేసిన గ్రీకు మహిళ…అంతా ఒత్తిడి నుంచి బయటపడడానికేనట

-

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వైరస్ సోకి దాదాపు 8 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 2 లక్షల మంది కి పైగా కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. అయితే ఈ వైరస్ పేరు వినగానే ఎక్కడ ఎప్పుడు ఈ వైరస్ బారిన పడతామా అంటూ ప్రజలందరూ ఆందోళన పడుతున్నారు. అయితే ఈ ఆందోళనలను పక్కకు పెట్టి ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక గ్రీకు మహిళ డ్యాన్స్ చేసింది. ఆ మహిళ తన అభిమాన నటి మాధురీ దీక్షిత్ పాపులర్ సాంగ్ ఏక్,దో,తీన్ పాటకు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె సహోద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్‌లో బుధవారం షేర్‌ చేశాడు. ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్‌ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన హిందీ నటి మాధురి దీక్షిత్‌ పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తోంది’ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇక అంతే ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోకు ఇప్పటి వరకూ 73 వేలకు పైగా వ్యూస్‌ రాగా.. 5వేల లైక్‌లు వచ్చాయి. చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికించేస్తుంది. ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం తో ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. చైనా తరువాత ఫ్రాన్స్,ఇటలీ, ఇరాన్,యూరప్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్ లో కూడా ఈ కరోనా కేసులు 151 కి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది కూడా.

 

Read more RELATED
Recommended to you

Latest news