ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల చొప్పున ఇస్తామని కడప టిడిపి మహానాడులో ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం అందించే 6000 రూపాయలతో కలిపి మూడు విడుదల్లో ఈ ఏడాది అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు.

మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా అదే జోరు అదే హోరు అన్నారు చంద్రబాబు. ఎన్నికలై ఏడాది గడిచినా టీడీపీ శ్రేణుల్లో అదే ఉత్సాహం కనిపిస్తోందని పేర్కొన్నారు. నా జీవితంలో 34 మహానాడులను చూశానని.. కానీ ఇప్పుడు దేవుని గడపలో జరుగుతున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వివరించారు.