ఏపీ ప్రభుత్వం లో ఆ ఇద్దరు మంత్రులు ఎందుకు సైలెంట్ అయ్యారు..? ఇప్పుడు వైసీపీ తో పాటు ప్రభుత్వం లో ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఆ ఇద్దరు మంత్రులే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అనిల్ కుమార్ యాదవ్ ,కొడాలి నాని జగన్ తరఫున పార్టీ తరఫున తమ వాణిని బలంగా వినిపించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీంతో జగన్ కు మరింత దగ్గరయ్యారు ఇద్దరు మంత్రులు.
అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశాల్లో విపక్షాలు ఎండగడుతూ ఉంటే కొడాలి నాని రాష్ట్ర శాసన సభలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అయితే గత నెల రోజులుగా ఈ ఇద్దరు మంత్రులు దాదాపుగా సైలెంట్ గా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఆయనా అప్పుడప్పుడు కనబడుతున్నారు. కానీ కొడాలి నాని మాత్రం అసలు మీడియాలోనే కనబడటం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాతో పాటు ప్రధానంగా చర్చ జరుగుతోంది. జగన్ పార్టీకి దూరంగా ఉన్నారని అలాగే ప్రభుత్వానికి కూడా కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం.
అయితే జగన్ కు అత్యంత విధేయుడిగా కొడాలి నానీకి పేరుంది. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఆయన గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మంత్రివర్గం నుంచి ఆయన్ను జగన్ తప్పించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం కూడా ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఆయన అసహనం తో సైలెంట్ గా ఉన్నారని కొందరంటుంటే వ్యక్తిగత కారణాలతో ఇప్పుడు ఆయన దూరంగా ఉన్నారని మరికొందరు అంటున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినా… రాజధాని విషయంలో ఆ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు ఆయన. ఆయన సన్నిహితుడు మంత్రి పేర్ని నాని మాత్రం మీడియాతో మాట్లాడుతూన్నారు. తాజా పరిణామాలపై అనిల్ కుమార్ యాదవ్ కూడా పెద్దగా స్పందించే ప్రయత్నం చేయటం లేదు. ఆ ఇద్దరు మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది.