శేఖర్ కమ్ముల చేస్తున్న ప్రయోగం నాగ చైతన్యని ముంచేయదు కదా …?

-

మన తెలుగు సినిమలలో ఒకప్పటి విషయం ఏమో గాని ప్రస్తుతం మాత్రం స్క్రీన్ మీద సక్సస్ ఫుల్ లవ్ స్టోరీసే సక్సస్ అయి హిట్ అందుకుంటుంన్నాయి. ఫేల్యూర్ లవ్ స్టోరీస్ జనాలకి ఎక్కడం లేదు. కథ ఎంత బావున్నా కూడా హీరో, హీరోయిన్ క్లైమాక్స్ లో విడిపోవడమో.. చచ్చిపోవడమో జరిగితే మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదు. సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం హీరో, హీరోయిన్ కలవాల్సిందే. కలవకుండా విడిపోతే సినిమా పోతుంది. అలా తయారైంది మన తెలుగు సినిమా పరిస్థితి. ఇప్పుడు కూడా ఒక తాజా చిత్రం ఇదే జోనర్ లో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

 

ఇద్దరు భగ్న ప్రేమికులు… ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమనే సర్వస్వంగా భావిస్తుంటారు… ఆ స్వచ్ఛమైన ప్రేమలో మునిగి తేలుతూ ఆనందంగా గడుపుతుంటారు. హాయిగా సాగుతున్న తమ ప్రేమ కి సడెన్ బ్రేక్ పడుతుంది. ఈ స్వచ్ఛమైన ప్రేమకథ ని ‘లవ్ స్టోరి’ పేరుతో క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. గతం లో ఆయన అందరూ కొత్త వాళ్ళతోనే సినిమాలు తీసి సక్సస్ అయ్యోవారు. కాని ఈ మధ్య ట్రెండ్ అండ్ ఫార్ములా మార్చారు. శేఖర్ కమ్ముల లాస్ట్ సినిమా ఫిదా. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించారు. సినిమా సూపర్ హిట్.

అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళతో ప్రయోగం చేయాలనుకున్నాడు. కొంత షూటింగ్ కూడా జరిపాడు. అయితే రష్ చూసుకున్న శేఖర్ కమ్ముల ఉన్న పలంగా ప్రాజెక్ట్ నుండి మిడిల్ డ్రాపయ్యాడు. ఆ తర్వా నాగ చైతన్య సాయి పల్లవి లతో లవ్ స్టోరి ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ కంప్లీటయిందని సమాచారం. “స్వచ్ఛమైన ప్రేమికులు… ఓ మంచి పనికోసం తమ ప్రేమని త్యాగం చేస్తారు” .. అన్న కాన్సెప్ట్ తో శేఖర్ కమ్ముల ఈ సినిమాని రూపొందిస్తున్నారట. దేవదాస్, లైలా మజ్ను వంటి సినిమాల తరహాలో ఈ సినిమా కథ సాగుతుందట. మరి ఆ రెండు సినిమాలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా లిచాయి. మరి ఈసారి శేఖర్ కమ్ముల నాగ చైతన్య సాయి పల్లవి లతో చేస్తున్న ప్రయోగం సక్సస్ అవుతుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news