ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పై చెప్పులు అలాగే రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ వైయస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు అలాగే రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో కానిస్టేబుళ్లు, మహిళలకు గాయాలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో… అమరావతి మహిళలకు మద్దతుగా అక్కడే నిరసన చేస్తున్న టిడిపి శ్రేణులు అలాగే వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేసినట్లు తెలుస్తోంది.