కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా – ఈటల

-

కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా ? అని ప్రశ్నించారు.

etala rajendhar
etala rajendhar on REVANTH OVER KALESHWARAM

ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు వారిని అడగండి స్పష్టంగా చెప్తారు అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news