కడప జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ, రేపు వైయస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం పులివెందులకు చేరుకొని ఆయన రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 7:30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు.

దివంగత వైయస్సార్ జయంతి సందర్భంగా ఘాట్ లో ఆయనకు జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే ప్రార్థనలలో జగన్ పాల్గొంటారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలవనున్నారు.