తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేసారు. పిల్లలను ఉదయం 7 గంటలకు స్కూల్‌కి పంపించి.. సాయంత్రం 7 దాకా అక్కడే ఉండేలా చూడాలని వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇలా చేయగలిగితే.. పిల్లలను గురుకులా పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని పేర్కొన్నారు. అందుకే పిల్లలను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బడికి పంపాలన్నారు.

మీ గ్రామంలోని నిరుద్యోగులకు నెలకు రూ.10 వేలు ఇస్తే మీ పిల్లలకు మంచి చదువు చెప్తారు అని కూడా తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు.
పిల్లలను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బడికి పంపాలి
మీ గ్రామంలోని నిరుద్యోగులకు నెలకు రూ.10 వేలు ఇస్తే మీ పిల్లలకు మంచి చదువు చెప్తారు – మంత్రి జూపల్లి కృష్ణారావు pic.twitter.com/wPwygbWons
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025