హిందీ భాషను వ్యతిరేకించడం అంటే ముందు ముందు తరాల అభివృద్ధిని పరిమితం చేయడమేనంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. తెలుగు భాష అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ అన్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో నిర్వహించిన అధికార భాష స్వర్ణోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంగ్లీష్, పర్షియన్, ఉర్దూ భాషలను అంగీకరించి హిందీని వ్యతిరేకించడం అవివేకమని అన్నారు.

మాతృభాష తెలుగు అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిదని పవన్ కళ్యాణ్ అన్నారు. మన రాజ్య భాషా హిందీని జాతీయ భాషగా స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తెలుగు భాష మనకు అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ లాంటిది –ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/gLCvPH7Fm7
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025