పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలలో డైలాగులు తీసేయండి అంటూ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాల్లోని డైలాగులపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్, బాలయ్య సినిమాల్లోని డైలాగులు ఎంతో దారుణంగా ఉంటాయని ఫైర్ అయ్యారు.

కానీ.. వాటినే పోస్టర్లలో పెడితే మాత్రం తప్పని కేసులు పెడుతున్నారు… మరి ఆ డైలాగ్స్ ఎందుకు పెడుతున్నారు? సెన్సార్ బోర్డు ఎందుకుంది? అని నిలదీశారు జగన్ మోహన్ రెడ్డి. నటనలో ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు మించిపోయాడని చురకలు అంటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో సాధారణ మహిళలకే కాదు పదవుల్లో ఉన్నవారికి కూడా రక్షణ లేదని మండిపడ్డారు. పట్టపగలే కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారికపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘోరాన్ని పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప ఆపలేదని ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వినే పోలీసులకు మాత్రమే పోస్టింగులు ఇస్తున్నారన్నారు.