తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో తెలుగు, తమిళంలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. సూర్య సినిమాలకు విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రం ‘కరుప్పు’. ఈరోజు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీరియడికల్ కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో అదిరిపోయే బీజీఎం, డ్యూయల్ లుక్స్ లో సూర్య, ఫైటింగ్, డైలాగ్ సీక్వెన్స్ లు సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ టీజర్ చూసిన సూర్య అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.