బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం పై చర్చలు జరిగాయని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ పొత్తు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ఇవాళ వరకు తమ నిర్ణయం అదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రం వెనుకంజలోకి వెల్లిందన్నారు.
రుత్విక్ కంపెనీ తనది కాదన్న సీఎం రమేష్ మాట మీద కట్టుబడి ఉంటాడా..? అని సవాల్ విసిరారు జగదీశ్ రెడ్డి. మరోవైపు ఇటీవల సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పై కేసులో పెట్టకుండా ఉండాలని కోరారు. ఈ విషయం ఇంతకాలం బయటపెట్టకపోవడానికి కారణాన్ని సీఎం రమేశ్ వివరించారు.