జగన్‌ నెల్లూరు పర్యటన.. పోలీసుల లాఠీఛార్జ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు కాస్త ఓవరాక్షన్ చేశారు. వైసిపి కార్యకర్తలపై పోలీసులు లాఠి ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

jagan
Jagan’s visit to Nellore Police lathicharge

కాసేపటికి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా వైసీపీ శ్రేణులు వచ్చారు. వాళ్లను కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఇక కాసేపట్లో జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. జగన్ పర్యటన సందర్భంగా మొత్తం 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news