రిజర్వేషన్లు అమలయ్యే వరకు స్థానిక ఎన్నికలు ఆపండి : ఎమ్మెల్సీ కవిత

-

బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు స్థానిక ఎన్నికలు ఆపండి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 72 గంటల నిరహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేసుకునేందుకు ఫర్మిషన్ ఇచ్చారు. మన ముఖ్యమంత్రి ధర్నా చేసుకునేందుకు ఫర్మిషన్లు ఇచ్చామని ఢిల్లీలో గొప్పలు చెప్పారు. కానీ ఇక్కడ అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద కవిత బీసీ దీక్ష చేపట్టారు. మన ప్రజాస్వామ్యంలో నాలుగు స్థంభాలుంటే.. మీడియా పవర్ పుల్ స్థంభం అన్నారు కవిత. బీసీలకు సపరేటుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత.

MLC Kavitha

బీసీ సంఘాలతో 72 గంటల పాటు ఎమ్మెల్సీ కవిత నిరహార దీక్ష చేపట్టారు. బీసీ సంఘం నాయకులు అందరూ మద్దతు ఇవ్వాలి. ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరు.. చేతులెత్తి పోరాటం చేస్తేనే తప్ప.. ఉత్తుత్తిగా హక్కులు రావు. జవాబు వచ్చే వరకు పిడికిలి ఎత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. 72 నిరహార దీక్ష చేస్తున్నాం. తమిళనాడులో 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు. అక్కడ వాళ్లు ఉడుం పట్టు పట్టి రిజర్వేషన్లు సాధించుకున్నారు. ఇక్కడ కూడా మనం అలాగే ఉడుం పట్టు పడితే సాధించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news