తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణాలో 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.

24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అటు నేడు హైదరాబాద్, వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలుపడనున్నాయి.