తెలంగాణ రాష్ట్ర మహిళా మణులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సోలార్ ప్లాంట్ లు నెలకొల్పే మహిళలకు నాలుగు ఎకరాల భూమి కేటాయించాలని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని గుర్తించేందుకు చర్యలు కూడా తీసుకుంటుంది.

ఒక మెగా వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు మూడు కోట్ల వ్యయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో 10 శాతం మహిళా సంఘాలు భరించనున్నాయి. మిగిలిన 90% బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు. ఇక ఆ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా రంగం సిద్ధం చేశాయి.