రష్మిక మీద రగిలిపోతున్న హీరో ..ఇంకెప్పుడు తనని నా సినిమాలో తీసుకునే ప్రసక్తే లేదు ..!

-

టాలీవుడ్ లో రష్మిక మందన్న ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హిరోయిన్స్ ఒకరుగా వెలుగుతున్న సమగతి తెలిసిందే. పూజా హెగ్డే తర్వాత మళ్ళీ ఛాన్సులు దక్కించుకుంటుంది ఈ కన్నడ బ్యూటి నే. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మమచి కమర్షియల్ హిట్ అందుకుంది. అంతేకాదు రీసెంట్ గా యంగ్ హీరో నితిన్ తో చేసిన భీష్మ కూడా రష్మిక కి సూపర్ హిట్ ని ఇచ్చింది. ఇక కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘కిరాక్ పార్టీ’. ఈ సినిమా తోనే రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమలో పాపులర్ అయింది. ఈ సినిమా సక్సస్ తోనే టాలీవుడ్ లో వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘ఛలో’ సినిమాలో రష్మిక అవకాశం ఇచ్చాడు.

 

ఈ సినిమా మంచి హిట్ కావడం తో రష్మిక వరుసగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు… సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రష్మిక మాజీ లవర్ అయిన రక్షిత్ శెట్టి కిరాక్ పార్టీ కి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సీక్వెల్ కి అందరు పార్ట్ వన్ కి చేసిన వాళ్ళనే ఎంచుకున్నాడు. కానీ రష్మిక మందన్న ని మాత్రం కాదన్నాడట.

కిరాక్ పార్టీకి సీక్వెల్ ని చేస్తున్నప్పటికి అందులో రష్మిక మాత్రం నటించబోదని రక్షిత్ తేల్చి పారేశాడు. అయితే అందుకు కారణం బలమైనదే. కిరాక్ పార్టీ సమయంలో రక్షిత్, రష్మిక లవ్ లో పడ్డారు. పెళ్ళి కూడా చేసుకోవలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని రష్మిక ఆ ఎంగేజ్‌మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో స్టార్స్ పక్కన హీరోయిన్ గా అవకాశాలు వచ్చి పాపులారిటి రావడంతో రక్షిత్ తో తెగతెంపులు చేసుకుంది రష్మిక. ఆ కారణంతోనే రక్షిత్ ఇప్పుడు రష్మిక ని కేర్ చేయడం లేదు అంతేకాదు కిరాక్ పార్టీ సీక్వెల్ లో ఛాన్స్ ఇవ్వలేదట.

Read more RELATED
Recommended to you

Latest news