టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందాన ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు… ఒకే చోటకు వెళ్లి చాలాసార్లు దొరికిపోయారు. విదేశాలకు కూడా వెకేషన్కు వెళ్లి ఫోటోలు పంచుకొని అడ్డంగా బుక్ అయ్యారు.

ఇన్ని వార్తలు వచ్చినా కూడా తమ మధ్యలో ప్రేమ లేదని లేదా ఏదో ఒక రియాక్షన్ మాత్రం విజయ్ దేవరకొండ గాని లేదా రష్మిక మందాన గాని ఇవ్వలేదు. ఇలాంటి నేపథ్యంలోనే రష్మిక అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు ఒకే ఈవెంట్లో మెరిశారు.
న్యూయార్క్ లో జరిగిన 43వ ఇండియా డే పరేడ్ ఈవెంట్ లో.. విజయ్ అలాగే రష్మిక గ్రాండ్ మార్చల్స్ గా పాల్గొనడం జరిగింది. ఈ ఇద్దరు వాహనంపై పరేడ్ చేస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం జాతీయ జెండాను కూడా అమెరికాలో ఎగురవేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Guys my #Virosh is back after so so long 🤍🤍🥹
The vibe, the grace, the cutenes🤌🤌
I honestly don’t think I can sleep tonight… and plus they’re holding hands 😭😭😭#Rashmikamandanna#VijayDeverakonda pic.twitter.com/TOVzLPN4Xk— Aysha Musthaq (@AyshaMusthaq) August 17, 2025