యానిమేషన్ వండర్ మహావతార్ నరసింహా సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. హిందీలో ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబడుతుంది. హిందీలో ప్రభాస్ హీరోగా నటించిన సాహూ రూ. 150 కోట్లు, సలార్ రూ. 153 కోట్లు లైఫ్ టైమ్ కలెక్షన్లను మహావతార్ నరసింహ సినిమా దాటేసింది. ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే రూ. 160 కోట్ల కలెక్షన్లతో రికార్డులను తిరగరాస్తోంది.

ఇలాగే ఈ సినిమా మరికొన్ని రోజులపాటు థియేటర్లలో ఉన్నట్లయితే రూ. 200 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 300 కోట్లు కలెక్షన్లకు దగ్గరలో ఉంది. దీంతో మహావతార్ నరసింహ సినిమా ప్రభాస్ హీరోగా చేసిన సినిమాలను దాటేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహావతార్ నరసింహ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతగానో ఫిదా అవుతున్నారు.