కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతు సహకారం అందించారు. కేంద్రానికి కోటి రూపాయలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి రూపాయల వరకు సహాయం చేసారు. దీనిపై ఇప్పుడు ప్రసంశల వర్షం కురుస్తుంది. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి తెలంగాణా మంత్రి కేటిఆర్ కి ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది.
తాను సహాయం చేస్తున్నట్టు పవన్ చేసిన ట్వీట్ కి కేటిఆర్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో సమర్థంగా మీ విధులు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అంటూ పవన్ దానికి స్పందించారు. దీనికి స్పందించిన కేటిఆర్… ‘‘ధన్యవాదాలు అన్నా.. అయినా మీరు నన్ను సర్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు. నేనెప్పుడూ మీ తమ్ముడినే. అలానే పిలవండన్నారు.
దానికి పవన్ స్పందిస్తూ సరే తమ్ముడు అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య… తగ్గినట్టే తగ్గి పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్క రోజే తెలంగాణాలో నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి.