ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షాక్ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇటీవల నెల రోజుల లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.

ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్, న్యాయవాదుల సూచనల అనంతరం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దింతో ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఇది ఇలా ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నాకు ఇంకా అందలేదు.. వచ్చాక స్పందిస్తాను అని ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు.