మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈరోజుల్లో ప్యాకింగ్ ఫుడ్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ మందికి జీర్ణక్రియ సమస్య వేధిస్తుంది. కడుపు శుభ్రంగా ఉంటే జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం, కానీ ఈ బిజీ లైఫ్ లో మన తిండి అలవాట్లు మారి కడుపులో సమస్యలు ఎక్కువవుతున్నాయి. దీనికి పరిష్కారం మన పెద్దలు చెప్పిన ఒక సింపుల్ పవర్ ఫుల్ చిట్కా తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ఎక్కువమంది నిద్ర లేవగానే కాఫీ,టీ ఏదో ఒకటి తాగుతారు. కానీ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా అల్లం పొడి తీసుకుంటే ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాక ఉసిరి పొడిని కూడా గోరువెచ్చ నీటి తో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి రెండు మన శరీరానికి సహజసిద్ధమైన డిటాక్స్ ఏజెంట్ల పనిచేస్తాయి.
ఉసిరి పొడి తయారి : ఎండబెట్టిన ఉసిరిముక్కలు తీసుకొని వాటిని బాగా పొడి చేయాలి, వీటిని ఒక సీసా లో నిల్వ చేసుకోవాలి. ఈ ఉసిరి పొడి గాలి చొరబడని డబ్బాలోనే నిల్వ చేయాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ వేడి నీటిలో అర చెంచా ఉసిరి పొడి కలుపుకొని రుచికోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట తీసుకోవాలి.
ఉసిరిలోని విటమిన్ C శరీరానికి పవర్ హౌస్ లాంటిది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అల్లం పొడి తయారీ: ఎండిన అల్లం (సొంటి) ముక్కలను తీసుకొని మెత్తగా పొడి చేయాలి. వీటిని ఒక గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. మార్కెట్లో అందుబాటులోనే సొంటి పౌడర్ దొరుకుతుంది. వీలు కుదరని వారు ఈ పొడినైనా ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ వేడి నీటిలో అర చెంచా సొంటి పొడిని కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే స్వీకరించాలి. రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మెల్లగా సిప్ చేస్తూ తాగాలి.
అల్లం అద్భుతమైన యాంటీఇంప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అల్లం వల్ల జీర్ణశయంలోని ఎంజైమ్‌లు ఉత్తేజితమై ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా సహాయపడుతుంది.
ప్రయోజనాలు: కడుపులో పేగుల కదలిక మెరుగుపడి, మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆహారం సులభంగా అరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ వల్ల వ్యాధులు రాకుండా శరీరం రోగనిరోధక శక్తి పెరిగి రక్షణ కవచంలా మారుతుంది.
ఈ సింపుల్ చిట్కాలను రోజు పాటించడం వల్ల మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చూడవచ్చు. ట్రై చేసి చూడండి..
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీన్ని ఏవైనా మందులు లేదా వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం గా తీసుకోకండి. వాడకముందు, మీ వైద్యుడి సలహా తప్పనిసరి.