తెలంగాణకు మరోసారి వాన గండం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

జనగాం, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, విజయనగరం అలాగే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది అమరావతి వాతావరణ శాఖ.