హైదరాబాద్ మహానగరంలో గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం కాగా… మరికాసేపట్లో బాలాపూర్ గణపతి కూడా కదలనున్నాడు. గణపతుల నిమజ్జనం నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో హైదరాబాదులో భారీ ఏర్పాట్లు జరిగాయి. అయితే.. నిమజ్జనం వచ్చిన ప్రతిసారి… కెసిఆర్ పాటలు ట్యాంక్ బండ్ వేదికగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు నుంచి గణపతి వెళ్ళినప్పుడు.. గులాబీల జెండాలమ్మా అంటూ కెసిఆర్ పార్టీకి సంబంధించిన పాటలు వేసి రచ్చ చేస్తున్నారు యూత్.

అయితే ఆ పాటలు అంత ఫేక్ అని కాంగ్రెస్ నిన్న సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ కౌంటర్ కు.. గులాబీ సోషల్ మీడియా రివర్స్ అటాక్ చేసింది. తెలంగాణ సెక్రటేరియట్ ముందు గులాబీ పాటలే కాకుండా కేసీఆర్ ఫోటోలతో కూడా యూత్ రచ్చ చేస్తున్నారని.. ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ ఫోటోలు పట్టుకొని గణపతి ముందు… చిందులు వేశారు కొంతమంది యూత్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నువ్వు ఇలాంటి కథలు పడుతున్నావ్ అనే ఇగో కేసీఆర్ గారి ఫోటో పట్టుకొచ్చినారు
ఈగ కుసోని ఏదువుర్రి అందరూ కలిసి https://t.co/TVJlL07RQz pic.twitter.com/1zTe6Fev49
— Sripaad R (@sripaad125) September 6, 2025