- నేడు ఉదయం 11 గంటలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్
- యూరియా కొరత, ఉపరాష్ట్రపతి ఎన్నిక లపై మాట్లాడే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది.

ఈ సందర్భంగా యూరియా కొరత అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వైసిపి నేతలపై అక్రమ కేసులు పెట్టడం, ఏపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఈ ప్రెస్ మీట్ లో ఎండగట్టే ఛాన్సులు ఉన్నాయి. అంతేకాదు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు వర్మ… ఇవాళ వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న పిఠాపురానికి చెందిన ముద్రగడ పద్మనాభంతో వర్మ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ లోకి వర్మ వెళ్తారని ప్రచారం జరుగుతోంది.