బందరు పోర్టుపై కీలక అప్డేట్ వచ్చింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు..పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడారు.. ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం అవుందని వెల్లడించారు.

ఈ పోర్టు రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తుందని స్పష్టం చేశారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు. ప్రణాళికలో భాగంగా మొత్తం 16 బెర్తులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి దశగా 4 బెర్తులను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు. ప్రస్తుతానికి 50 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని వివరించారు ఎం.టీ. కృష్ణబాబు.