ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు ఉండనుంది. చర్చల తర్వాతే సేవలు తిరిగి ప్రారంభిస్తామంటున్నాయి ఆస్పత్రుల అసోసియేషన్. CFMSలో పెండింగ్‌లో ఉన్న రూ. 674 కోట్లు కలిపి మొత్తం రూ. 3,800 కోట్ల బకాయిలు ఉన్నాయి.

త్వరలో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే సమావేశం జరగాలని పట్టుబట్టింది స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్. దీంతో ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవల నిలిపివేత కొనసాగింపు ఉండనుంది.
అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నిన్న అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు.. ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ ప్రవేట్ ఆసుపత్రిల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 323 ప్రవేట్ ఆసుపత్రులలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆయన… వెల్లడించారు.