నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో జగన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఈ రోజు వైయస్ జగన్ సమావేశం జరునుంది.

తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష ) సమావేశం కానున్నారు వైయస్.జగన్. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో చర్చించనున్నారు జగన్.
కాగా, నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలతో మొదలవుతాయి. మొదటి రోజు సమావేశాలలో ముఖ్యంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.