సండే స్పెషల్ ; కోడిగుడ్లతో రొయ్యల ఇగురు..!

-

కావలసిన పదార్థాలు:- నాలుగు గుడ్లు, పావు కిలో ఉల్లిపాయలు, అరకిలో రొయ్యలు, యాభై గ్రాముల నూనె, నాలుగు పచ్చిమిర్చి, రెండు స్పూన్ల కారం, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి పాయ, చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, చిన్న కొత్తిమీర కట్ట, రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం:- ముందుగా స్టౌ వెలిగించి ఒక గిన్నెలో గుడ్లు పెట్టి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. గుడ్లు ఉడికిన తరువాత పెంకు తీసి గార్లు పెట్టీ ఉంచుకోవాలి. తరువాత పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకుని నూనె పొయ్యాలి. నూనె కాగాక పొట్టు వలసి కడిగి పెట్టుకొన్న రొయ్యలను వేయించుకోవాలి. రొయ్యలు తీసిన తరువాత గాట్లు పెట్టుకున్న గుడ్లు కూడా వేయించుకోవాలి.

అవి వేగాక పక్కకు తీసి ఆ నూనె లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అవి వేగే లోపు అల్లం వెల్లుల్లి ముద్ద నూరు కోవాలి.ఉల్లి పాయలు వేగాక అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా వేయించుకున్న రొయ్యలు, గుడ్లు వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరగా వచ్చే వరకు ఇగర నిచ్చి కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కోడి గుడ్లు, రొయ్యల ఇగురు రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news