ఏపీలో పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు.. ఎప్ప‌టి నుంచంచే

-

ఏపీలో పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ఇచ్చారు. ఈ నెల 22 నుంచి పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కోరిన‌ మేర‌కు సెలవులపై విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు నారా లోకేష్‌.

అటు తెలంగాణలో సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ దసరా సెలవులలో ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలలో ఎలాంటి తరగతులను నిర్వహించకూడదని ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సెలవులలో రివిజన్ కోసం విద్యార్థులకు కొంతవరకు హోంవర్క్ ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news