తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని రాయలసీమలో ఈరోజు మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నంద్యాల, శ్రీ సత్య సాయి, కర్నూలు, అన్నమయ్య, కడప, చిత్తూరు, తెనాలి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయవాడ, అల్లూరి, ఏలూరు, కోనసీమ, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు జల్లులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచనలు జారీ చేశారు. నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని సూచనలు జారీ చేశారు. ఈనెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.