కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అందరికి తెలిసిందే. ఈ కరోనా నేపథ్యంలో దాదాపు చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి కూడా. అయితే ఈ కరోనా మహమ్మారి గురించి అగ్రరాజ్యానికి ముందే సమాచారం ఇచ్చామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యుంగ్ పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 27 వ తారీఖున కొన్ని అనుమానిత కేసులను గుర్తించామని అధికారికంగా ఈ విషయాన్నీ జనవరి 3 వ తేదీనే డబ్ల్యూ హెచ్ తో తో పాటు అమెరికా,ఇతర దేశాలకు తెలియజేశామని ఆమె మాట్లాడుతూ తెలిపారు. డిసెంబర్ లో కొన్ని అనుమానిత కేసులను గుర్తించామన్న ఆమె ఆ కేసులపై ఎపిడమాలాజికల్ సర్వేను డిసెంబర్ 29వ తేదీన చేపట్టామన్నారు. ఓ రోజు తర్వాత వుహాన్ హౌజ్ కమీషన్ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. చైనా హెల్త్ కమిషన్ జనవరి 31వ తేదీన వైద్య నిపుణులను వుహాన్‌కు పంపించామని, ఆన్‌సైట్ విచారణ కోసం ఆ టీమ్‌ను పంపించామని ఆమె తెలిపారు. చైనాకు చెందిన సీడీసీ.. వైరస్‌కు చెందిన జన్యుక్రమాన్ని జనవరి 11వ తేదీన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు చెప్పారు. ఆ తరువాత జనవరి 23వ తేదీన వుహాన్‌ను షట్‌డౌన్ చేయాలని ఆదేశించామని. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, తమ ప్రయత్నాలను డబ్ల్యూహెచ్‌వో కూడా మెచ్చుకున్నట్లు ఆమె వెల్లడించారు. చైనా లోని వూహన్ లో పురుడుపోసుకున్న ఈ వైరస్ పై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.
ఈ కరోనా అనేది చైనా వదిలిన జీవాయుధం అని కొన్ని అభిప్రాయపడుతుంది,మరికొన్ని మాత్రం మృతుల విషయంలో చాలా గోప్యత పాటిస్తుంది అంటూ భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షల మంది ఎఫెక్ట్ అవ్వగా, 38 వేల మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.