కరోనా దెబ్బకు దేశంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ప్రజలందరూ వారి ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితి అంతటికీ భిన్నంగా కొందరు ప్రజల రక్షణ కోసం వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టీ తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు మాత్రం భాద్యతాయుతంగా తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారు.
పోలీసులు మండుటెండను సైతం లెక్కచేయకుండా డ్యూటీ చేస్తుంటే, డాక్టర్లు ఏకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇక పారిశుధ్య కార్మికులు ఎప్పటకప్పుడు రహదారులను శుభ్ర పరస్తున్నారు. తెలిసో తెలియకో లేదంటే ఈ కరోనా వైరస్ పట్ల అవగాహన లేకుండా రోడ్ల మీదకు వస్తున్న జనానికి ఈ వైరస్ పట్ల అవగాహన కలిగిస్తూ, తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ,
పోలీసులు తమ విధులను నిర్వర్తించడం ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైసీపీ ఎమ్మెల్యే అయితే ఏకంగా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌కి పాదాభివందనం చేసి, ఆయన చేస్తున్న సేవలను అభినందించారు. ఎమ్మెల్యే పాదాభివందనం చేయడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా గౌరవసూచకంగా సెల్యూట్ చేశారు. కాళ్ళు మొక్కడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
#WATCH Andhra Pradesh: Araku MLA Chetti Phalguna touches feet of an Assistant Sub Inspector in Visakhapatnam as a mark of gratitude for police services during #CoronavirusLockdown. pic.twitter.com/XDYo8tlq4p
— ANI (@ANI) April 1, 2020