ప్రపంచ వ్యాప్తంగా దేశ దేశాన్ని వణికిస్తున్న కరోనాపై ప్రాణాలు కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోన్న వైధ్య సిబ్బందికి, పారిశుద్ద సిబ్బందికి .. ప్రతి ఒక్కరికి మనం జీవితాంతం ఋణ పడి ఉండాల్సిందే. ఈ రోజు కరోనా వ్యాధి బారిన పడిన పడి ప్రాణాలతో పోరాడుతున్న వారికి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు కూడా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారంటే కరోనా ఎంత వేగంతా వ్యాపించి బలి తీసుకుంటుందో ఊహించవచ్చు. ఊహకే అందనన్ని మరణాలు సంభవిస్తున్నాయంటే ఇది మారణ హోమమే.
ఈ నేపథ్యం లో కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తోన్న వారికి… వాళ్ళకి సేవలు అందిస్తోన్న వారికి అండగా నిలిచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అలాగే, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చారు. ఆ తర్వాత లాక్ డౌన్ ని ప్రకటించారు. ఈ లాక్ డౌన్ తోనే మన దేశం లో మరణాల సంఖ్యని సాధ్యమైనంతవరకు తగ్గించగలిగాము.
ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం ప్రజలు అందరూ రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పేసి దీపపు జ్యోతులు 9 నిమిషాలు పాటు వెలిగించాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. మోదీ పిలుపుతో యావత్ 130 కోట్ల మంది భారతీయులు జ్యోతులు వెలిగించి మనదేశ ఐక్యత చాటారు. ఎంతో మంది సామాన్య ప్రజల నుంచి సినిమా సెలబ్రిటీలు వరకు అందరూ దీపాలు వెలిగించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కుటుంబం సమేతంగా దీపాలను వెలిగించారు. అందరికీ స్పూర్తుగా నిలుస్తూ ఆ ఫొటో సోషల్ మీడిమాలో పోస్ట్ చేశారు.