ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ప్రతీ ఒక్కరు కూడా ముందుకి వచ్చి దీపాలను వెలిగించారు. సినీ రాజకీయ, క్రీడా, వ్యాపార, స్వామీజీలు, ఇలా ప్రతీ ప్రముఖుడు కూడా దీపారదనలో పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రతీ ఒక్కరు కూడా ఈ పిలుపుని విజయవంతం చేసారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీపాలు వెలిగించారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొవ్వొత్తులు వెలిగించారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో దీపాలు వెలిగిస్తే జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో కొవ్వొత్తి వెలిగించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం, విపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ కొవ్వొత్తి వెలిగించారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీపాలు వెలిగించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన నివాసంలో దీపం వెలిగించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కెప్టెన్ అమరీందర్ సింగ్, చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, స్మ్రితి ఇరాని, రాజనాథ్ సింగ్, అమిత్ షా ఇలా ప్రతీ ఒక్కరు కూడా ముందుకి వచ్చి దీపాలు వెలిగించారు. దీనిని చూసిన ప్రపంచం ఆశ్చర్యపోయింది.
शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥ pic.twitter.com/4DeiMsCN11— Narendra Modi (@narendramodi) April 5, 2020
భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో జ్యోతిని వెలిగించారు. ప్రధానమంత్రి శ్రీ @narendramodi ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు సీఎం కొవ్వొత్తి వెలిగించారు. #9MinutesForIndia #diyas pic.twitter.com/okOBjKdRX5
— Telangana CMO (@TelanganaCMO) April 5, 2020
Joining the nation in manifesting the power of unity by lighting a spark of hope. Let’s stand as one in the battle against #COVID19Pandemic pic.twitter.com/nGJdFBT3rK
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2020
#LightForIndia #9PmFor9Minutes #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/n2e90soX8p
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 5, 2020