మళ్ళీ అదే తప్పు చేస్తున్న జగన్…

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్ళీ వాలంటీర్లను నమ్ముకుని తప్పు చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కేసులు చాలా వరకు అదుపులో ఉన్నాయి. కాని ఇప్పుడు కేసుల సంఖ్య అనేది క్రమంగా పెరగడంతో కేంద్రం కూడా రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.

ఇప్పటికే సీఎస్ కి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై ఆమెను ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ కట్టడి చేయడానికి గానూ ట్రిపుల్ టి నమ్ముకున్నారు. అంటే ట్రేస్, టెస్ట్, ట్రీట్మెంట్… ఈ ఫార్ములాను ముందు అమలు చేసింది దక్షిణ కొరియా. అందుకే అక్కడ కరోనా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… కరోనా విషయంలో ఒక తప్పు చేసింది. హెల్త్ వర్కర్లు, గ్రామ లేదా వార్డు వాలంటీర్లు ఇళ్ళకు వెళ్లి ఆ ఇళ్లలో కుటుంబ సభ్యుల వయసు, ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా అన్నది తెలుసుకుంటున్నారు. కాని ఢిల్లీ నుంచి ఎవరు వచ్చారు అనేది వారు గుర్తించలేదు.. అసలు కరోనా లక్షణాలు బయటపడాలి అంటే 14 రోజులు పడుతుంది.

ఇలాంటి తరుణంలో అలాంటి కార్యక్రమం చాలా తప్పు. ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ టి కాకుండా వాళ్ళను ఇళ్ళకు పంపాలని చూస్తున్నారు. దీనితో కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఇక కొత్తగా ఎవరికీ కరోనా వైరస్ సోకకుండా ఆపినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాని అది ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇచ్చి ఉంటే ఇన్ని కేసులు పెరిగేవి కావు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news