బాబు కంటే జగన్ బెటర్ అండ్ బెస్ట్ .. టీడీపీ నోట్లోంచి బయటకొచ్చిన ఆణిముత్యం !

-

సాధారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్న తప్పు దొరికిన, టైం దొరికినా వైయస్ జగన్ ని ఏమాత్రం విడిచిపెట్టారు. ఏదో రకంగా సమస్యని అటుఇటుగా తీసుకువచ్చి అధికారంలో ఉన్న వైయస్ జగన్ ని ఇబ్బందులు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ విధంగానే ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు జగన్ గాలి తీయాలని ప్రయత్నం చేసి, చివరాకరికి బాబు కంటే జగన్ బెటర్ అండ్ బెస్ట్ అయ్యేలా అనుకోకుండా ప్రూవ్ చేశాడు. పూర్తి మేటర్ లోకి వెళ్తే చాలా సందర్భాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు…సంపదను సృష్టించడం లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మించినవారు దేశంలో ఎవరూ లేరని అంటుంటారు.జగన్... ఎన్డీఏలో చేరితే... బాబు ...ఎక్కువగా చంద్రబాబు ఇమేజ్ తోనే ప్రత్యర్థులను టిడిపి నాయకులు దెబ్బతీస్తరు. ఈ నేపథ్యంలో ఇటీవల కరోనా వైరస్ రావడంతో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొనడం తో వైయస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పాలు చేస్తున్నారు అని జగన్ సర్కార్ పై విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో బడ్జెట్ రిలీజ్ కావటంతో టీడీపీ నాయకుడు ధూళిపాల నరేంద్ర.. జగన్ ని విమర్శలు చేయడానికి ఇరుకున పెట్టడానికి బడ్జెట్ కి సంబంధించి బహిరంగ లెటర్ రాయడం జరిగింది.

 

దూలిపాళ్ళ నరేంద్ర రాసిన ఆ లేఖలో చెప్పకనే కొన్ని నిజాలు అనుకోకుండా చెప్పేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి వచ్చింది లక్షా 57 వేల కోట్లు అయితే. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి లక్షా 87 వేల రూపాయలు నిధులు వచ్చాయని పొరపాటున నిజం చెప్పేశారు. అంటే జగన్ సర్కార్ చంద్రబాబు కంటే కూడా ముప్పయి వేల కోట్ల రూపాయలు అదనంగా ఏపీకి ఒక్క ఏడాదిలోనే సాధించిందని నరేంద్ర ఆ లేఖలో అసలు గుట్టు విప్పి చెప్పేశారు. స్వయంగా ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకులు నోట్లో నుంచి ఆణిముత్యం లాంటి మాటలు బయటకు రావడంతో వైసీపీ నాయకులు టీడీపీ పై సెటైర్స్ వేయడం స్టార్ట్ చేశారు. అసలు మా ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని ఎందుకు అంత అబద్ధాలు ఆడతారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు కదా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని. లెక్కలతో సహా బలే చెప్పారు అని గట్టిగా ఈ పాయింట్ ను పట్టుకున్నారు వైసిపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news