మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్ లక్ష్మి హీరోయిన్ గా కాకుండా తన టాలెంట్ చూపించే ప్రత్యేకమైన సినిమాల్లో నటిస్తూ వస్తుంది. నిర్మాత, నటిగా మంచు లక్ష్మి ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుండగా ఇప్పుడు ఆమె వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇన్నాళ్లు హీరోయిన్స్ కు మాత్రమే దక్కే ఈ ఛాన్స్ మంచు లక్ష్మి క్రేజ్ దృష్ట్యా ఆమెకు దక్కింది.
ప్రస్తుతం ఆమె కుర్ కురే యాడ్ లో కనిపిస్తుంది. ఇది ఎంతో నమ్మకమైందని.. కలకత్తాలోని కుర్ కురే తయారీ కేంద్రానికి వెళ్లి చూశానని చెప్పింది. అయితే ఈ యాడ్ పై ఓ నెటిజెన్ మంచు లక్ష్మికి ఓ ఛాలెంజ్ విసిరాడు. ఇలా చెప్పడం కాదు ఇంటికి వెళ్లి మీ పాపకు.. మంచు విష్ణు పిల్లలు తింటున్న వీడియో పోస్ట్ చెయ్యి అప్పుడు నమ్ముతాం. మీరోజే ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకుంటారు మాకు ఇలాంటివి తినాలని సలహా ఇస్తుంటారని అన్నాడు.
కుర్ కురే మీద అప్పట్లో కొన్ని రాష్ట్రాల్లో నిషేధం కూడా జరిగింది. అయితే కోర్ట్ ఆర్డర్స్ తో కుర్ కురే మీద ఉన్న రూమర్స్ తొలగిపోయాయి. మరి నెటిజెన్ ఛాలెంజ్ కు మంచు లక్ష్మి ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.