కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ఇప్పుడు ఎక్కువగా ప్రజలు గుడ్డ మాస్క్ ని వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రాలు కూడా దీనిని తప్పని సరి చేస్తూ ఆదేశాలు ఇస్తున్నాయి. ప్రజలు మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తాజాగా దీనిపై ఒక అధ్యయనం చేసారు. అసలు గుడ్డ మాస్క్ కరోనా వైరస్ ని కట్టడి చేసే అవకాశం ఉందా అనే దాని మీద ఇప్పుడు చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి.
అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) దీనిపై కీలక విషయాలు చెప్పింది. గుడ్డ మాస్క్ అనేది… కరోనా రాకుండా అడ్డుకోలేదు కాని… వ్యాప్తిని మాత్రం అడ్డుకునే అవకాశం ఉంటుందని… ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడే వస్తువు అని పేర్కొంది. వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉండి, అతను గుడ్డ మాస్కు ధరిస్తే… వ్యాధి మరొకరికి వ్యాపించే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది.
తుమ్మినప్పుడు… లేదా దగ్గు వచ్చిన సమయంలో నీటి బిందువులు గాల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని… వీటిల్లో వైరస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని గుర్తించారు. మాస్క్ లేకుండా తిరగడం కంటే గుడ్డ మాస్క్ అనేది చాలా మంచిది అని సూచనలు చేస్తున్నారు. ఇక శస్త్ర చికిత్స సమయంలో వాడే మాస్క్ లను డాక్టర్లు వాడకుండా ఉండటం మంచిది అని కూడా చెప్తున్నారు.