పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. అయితే ఇంకా ఈ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ‘రాధే శ్యామ్’ తో పాటు మరో రెండు టైటిల్స్ కూడా ప్రచారం లో ఉన్నాయి. ఇక ఈ సినిమాని రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటి లవ్ స్టోరీలో ప్రభాస్ నటించ లేదట. అయితే ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల తర్వాత వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది.
ఇక బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు కరన్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా నిర్మించాలని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా తరువాత ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని తాజా సమాచారం.
‘కేజీఎఫ్’ చాప్టర్ – 1 ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రశాంత్ నీల్ పేరు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఫేమస్ అయిపోయింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ‘కేజీఎఫ్’ చాప్టర్ – 1 కి వచ్చిన క్రేజ్ తో మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ‘కేజీఎఫ్’ చాప్టర్ – 2 రూపొందించాలని మేకర్స్ ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్’ చాప్టర్ – 2 ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ప్రశాం నీల్ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని తెలుస్తుంది.
ఆల్రెడి మైత్రీ మూవీస్ వాళ్ళ దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. అలాగే ఎన్.టి.ఆర్ డేట్స్, ప్రభాస్ డేట్స్ కూడా ఉన్నాయి. దాంతో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ అయిందని సమాచారం. వాస్తవంగా ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్ట్ ఉండాలి. కానీ ఎన్.టి.ఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకి రావడానికి ఇంకా సంవత్సరం పడుతుందని తెలుస్తుంది. దాంతో మైత్రీ వాళ్ళు ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ని సెట్ చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని యు వి క్రియోషన్స్ కూడా భాగస్వామ్యం గా ఉంటారని లేటెస్ట్ న్యూస్. లాక్ డౌన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందట.