రానాతో సినిమాకు నో చెప్పిన బాలయ్య…!

-

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. వరుసగా సినిమాలను విడుదల చేస్తూ ఆయన… బిజీ గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ఓకే చేసి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత కరోనా కారణంగా వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలియదు.

బాలకృష్ణ ఈ ఏడాది ఎలా అయినా సరే ఈ సినిమాను విడుదల చేసి హిట్ కొట్టాలి అని భావించారు. కాని అనూహ్య కారణాలతో ఈ సినిమా వాయిదా అపడింది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ చేసే సినిమా మీద స్పష్టత లేదు. మరో సినిమా కే గోపాల్ తో చేస్తారని అంటున్నారు. పూరి జగన్నాథ్ తో కూడా ఒక సినిమాను ఆయన ఓకే చేసినా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బిజీగా ఉండ‌టంతో బాల‌కృష్ణ ఈ మల‌యాళ రీమేక్‌లో న‌టించడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. ఈ సినిమా బాలకృష్ణ తో పాటుగా రానా కూడా నటిస్తున్నాడని అన్నారు. కాని బాలకృష్ణ తప్పుకోవడం తో కొత్త హీరో కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news