దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత చాలా మందికి అర్ధం కావడం లేదు. దాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా అనేది మనం ఊహించుకున్న తక్కువది కాదు. కరోనా వైరస్ అనేది మన ఊహకు కూడా అందని పరిస్థితి. అది పుట్టి మహా అంటే నాలుగు నెలలు కూడా పూర్తిగా కాలేదు. నాలుగు దశాబ్దాల నుంచి వేధిస్తున్న ఎయిడ్స్ నయం అని అమెరికా అంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు
మనం భయపడ వచ్చు అని ప్రభుత్వాలు నిజం దాచే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ప్రజలను కాపాడటానికే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే నిజాలు దాచి మనను కంగారు పెట్టకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి. అందుకే ఎవరికి కరోనా వచ్చిందో వాళ్ళ పేరు బయటపెట్టే అవకాశం ఉండదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతీ చిన్న విషయం ఇప్పుడు పట్టించుకోవాలి.
ప్రజలకు కరోన తీవ్రత అర్ధం కావడం లేదని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. సామాజిక దూరం పాటించినా సరే కరోనా వైరస్ వస్తుంది. ఇళ్ళ నుంచి బయటకు రాకుండా అది వచ్చే అవకాశం ఉండదు. ఏదో ఖర్మ కాలి ఎవరో ఒకరు మన బండి మీద చేయి వేసినా అక్కడ మనం చేయి వేసినా అది మనకు వచ్చినట్టే. దయచేసి ఎవరూ కూడా బయటకు రాకుండా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి.
అసలు పిల్లలను పెద్దలను బయటకు పంపకండి. లాక్ డౌన్ ఏమీ సరదాగా పొడిగించే పరిస్థితి లేదు. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని గ్రహించడం మంచిది. పరిస్థితి చేయి దాటింది అనే విషయం అర్ధమవుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దాదాపు ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్పింది. కేసులు పెరుగుతున్నాయి అని లవ్ అగర్వాల్ అన్నారు. ఆయన ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి… కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే.