’96’ రీమేక్ సమంత ఇలా షాక్ ఇచ్చిందేంటి..!

-

కోలీవుడ్ లో ఈమధ్యనే రిలీజైన 96 మూవీ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా మంచి కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. తమిళంలో నోటాని పడగొట్టి 96 సినిమా విజయ కేతనం ఎగురవేసింది. అయితే ఈ సినిమా రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

తమిళంలో రిలీజ్ అవడానికి ముందే తెలుగు హక్కులను కొన్న దిల్ రాజు త్వరలోనే ఆ సినిమాను ఇక్కడ రీమేక్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాని, సమంత నటిస్తారని టాక్. ఇదే విషయాన్ని సమంత దగ్గర ప్రస్థావిస్తే ఆ సినిమా మళ్లీ రీమేక్ చేయకూడదు అంటూ షాక్ ఇచ్చింది. త్రిష పాత్రలో నటించడం ఇష్టం లేక అలా అన్నదా లేక ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పిందో తెలియదు కాని సమంత 96 సినిమాపై ఇంట్రెస్ట్ గా లేదని మాత్రం అర్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news