కోహ్లీ భారీ విరాళం…

-

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు కరోనా బాధితులకే కాదు క్రికెట్ మీద బ్రతికే వాళ్ళకు కూడా భారీ సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా కారణంగా ఇప్పట్లో క్రికెట్ మ్యాచులు జరిగే అవకాశాలు కనపడటం లేదు. దీనితో క్రికెట్ మీద బ్రతికే వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉదాహరణకు… క్రికెట్ మైదానంలో ప్రేక్షకులు కూర్చునే సీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే సిబ్బంది ఉంటుంది.

అలాగే క్రికెట్ మైదానాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే సిబ్బంది ఉంటుంది. అలాగే క్రికెట్ మైదానాల బయట మ్యాచులు ఆడే సమయంలో చిరు తిండి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు అందరూ కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. దీనితో తన సొంత రాష్ట్రం అయిన ఢిల్లీ, తన తండ్రి పుట్టిన పంజాబ్, తాను ఐపిఎల్ కి ప్రాతినిధ్యం వహించే బెంగళూరు లో ఉన్న కార్మికుల కోసం భారీగా సహాయం చెయ్యాలిఅని భావిస్తున్నాడు.

ఇందుకోసం ఆరు కోట్లను ఇప్పటికే అతను కేటాయించాడు అని అంటున్నారు. వాళ్లకు మూడు నాలుగు నెలలకు సరిపడా సరుకులను అందించాలి అని విరాట్ కోహ్లీ భావిస్తున్నాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కెఎల్ రాహుల్ తో కలిసి ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్ళు అందరూ కూడా హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news