‘ మహా ‘ కరోనా : కాపాడాల్సిన సమయం .. కాపాడుకోవాల్సిన సమయం

-

కరోనా వైరస్ మహారాష్ట్ర ని వణికిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర లోనే ఉంటున్నారు. ముంబైలోని ‘ధారవి’ అనే మురికివాడలో వైరస్ అంతకంతకు విజృంభిస్తోంది. మరోవైపు PPA లా కిట్ల కొరత కనిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర పరిస్థితి చాలా గడ్డు గా మారింది. దేశంలో మొత్తం రోగుల సంఖ్య 23 శాతం ఈ రాష్ట్రం లోనే ఉన్నారు. మరణాలో కూడా 45 శాతం ఈ రాష్ట్రంలోనే సంభవిస్తున్నాయి. దేశం మొత్తం మీద చనిపోతున్న వారి సంఖ్య సగటున 2.6 శాతం కాగా, మహారాష్ట్రలో ఈ సగటు 6.3 శాతంగా ఉంది.Indian real estate can evolve into trillion dollar economyరాష్ట్ర వ్యాప్తంగా 36 జిల్లాలకు గాను 28 జిల్లా లో వైరస్ విస్తరించి ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో పరిస్థితి మరీ ఇంకా చాలా దారుణంగా ఉంది. రాష్ట్రం మొత్తం రోగుల్లో 65 శాతం నగరవాసులే. అసలే దేశం ఆర్థికంగా వెనుకబడి పోయిన తరుణంలో…దేశ ఆర్థిక రంగానికి మూల నగరమైన ముంబాయి ప్రస్తుతం రెడ్ జోన్ లో ఉంది. ఇది అదుపులోకి రాకపోతే దేశ ఆర్థిక రంగానికి ఆయువు పట్టు అయిన ముంబాయి నగరం కొన్నాళ్లపాటు స్తంభించి పోవటం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా వైరస్ దేశంలో ప్రవేశించక ముందు ఎక్కువగా వ్యాపించింది ముంబై నగరంలోనే. అంతర్జాతీయ ప్రయాణికులు ద్వారా ఎక్కువగా చర్చకు వచ్చిందని నిపుణులు బలంగా నమ్ముతున్నారు.

 

ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి ఇంకా రెండు నెలలు ఉంటే కనుక దేశం చాలా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోవడంతో గ్యారెంటీ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలను కాపాడాల్సిన సమయమని..ముంబై నగరంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవాల్సిన విషయాలపై దృష్టి పెట్టాలని కూడా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటితే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శవాలు కుప్పలుతెప్పలుగా ఎలా రాలుతున్నాయ్యో…ఆ విధమైన పరిస్థితి ముంబైలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news